టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ప్రభాస్( Prabhas ) బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఈయన త్వరలోనే కల్కి( Kalki ) సినిమా ద్వారా రాబోతున్నారు.ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ట్రైలర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ పై సీనియర్ నటుడు నాగార్జున స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సాధారణంగా నాగార్జున( Nagarjuna ) ఎలాంటి సినిమాలో గురించి కూడా మాట్లాడరు.ఆయన సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు అలాంటిది నాగార్జున ప్రభాస్ నటించిన కల్కి సినిమా ట్రైలర్( Kalki Trailer ) గురించి మాట్లాడుతూ ఆయనపై ప్రశంశల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ.
ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించావ్ నాగీ.మహత్తరమైన మన భారతీయ కథలను వెండితెర పైకి తీసుకువస్తుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

కల్కి ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసిందని ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలనే ఆత్రుత కూడా కలుగుతుందని తెలిపారు.అమితాబ్ బచ్చన్ ఇరగదీశారు, కమల్ హాసన్ అదరగొట్టేశారు.ఇక ప్రభాస్ ప్రయోగాలు చేసేందుకు నువ్వు ఏమాత్రం వెనుకాడవు.నీలో ఆ గుణాన్ని నేను అభిమానిస్తాను.చిత్ర బృందానికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ చిత్ర బృందానికి ఈయన ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ఇటీవల నా సామి రంగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ప్రస్తుతం కుబేర( Kubera ) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.