బీజేపీ( BJP )కి ఏ పార్టీ పోటీ లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ మరిన్ని స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి 12 కు పైగా సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే శక్తి కాంగ్రెస్ కు లేదని చెప్పారు.
తెలంగాణను గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలపై ఆర్జీ ట్యాక్స్ వేస్తున్నారని విమర్శించారు.
ఏ ప్రాజెక్టుపైనా సరైన దర్యాప్తు జరగడం లేదన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project )పై విచారణ ఏమైందని ప్రశ్నించారు.ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అక్రమాలపై విచారణ చేయిస్తామన్నామన్నారు.కానీ ఇప్పుడు వారందరిని బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని విమర్శలు చేశారు.అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు.