సోషల్ మీడియా చాలామంది జీవితాలను మార్చేసిందని అనడంలో సందేహం లేదు.పల్లవి ప్రశాంత్, బర్రెలక్క అలియాస్ శిరీష, కుర్చీ అంకుల్, సునిషిత్, అగ్గిపెట్ట మచ్చ, దుర్గారావు, గంగవ్వ, లోకులు పలుకాకులు, కనకవ్వ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని సోషల్ మీడియా పాపులర్ చేసింది.
వీటివల్ల వారందరూ ఎంతో కొంత ప్రయోజనం పొందారు కానీ ఆ తర్వాత వారిని ఒక్కరు కూడా పట్టించుకోలేదు.సోషల్ మీడియా( Social Media ) పాపులారిటీని ఉపయోగించుకుని బాగుపడ్డ వారు వున్నారు.
ఆ పాపులారిటీ మాయలో పడి ఉన్న వృత్తిని కోల్పోయి బజారున పడ్డ వారూ ఉన్నారు.
ఇటీవల కాలంలో కుమారి ఆంటీకి( Kumari Aunty ) సోషల్ మీడియా బాగా ప్రాధాన్యత ఇస్తోంది.ఆమెను ఆకాశమంత ఎత్తుకు ఎత్తేస్తోంది.యూట్యూబ్ ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఆమెను ఒక సెలబ్రిటీగా ట్రీట్ చేస్తున్నారు కొంతమంది.
కుమారి ఆంటీ లవ్ స్టోరీ అంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మరికొందరు.కుమారి ఆంటీ త్వరలోనే బిగ్ బాస్ లో( Bigg Boss ) రాబోతోందంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో( Sridevi Drama Company ) కనిపించబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.అయితే అందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ స్టార్ మా ప్రసారం చేస్తున్న ఒక షోలో మాత్రం కుమారి ఆంటీ వచ్చింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్లతో బీబీ ఉత్సవం( BB Utsavam ) పేరిట ఒక కార్యక్రమాన్ని స్టార్ మా ఛానల్ టెలికాస్ట్ చేస్తోంది.దీనికి శ్రీముఖి( Sreemukhi ) యాంకర్.ఈ షో కి ఆమెను తాజాగా పిలిచారు.శ్రీముఖి కుమారి ఆంటీ ని హత్తుకొని అక్కా అంటూ ఒక హగ్గుతో ఆహ్వానించింది.బీబీ కంటెస్టెంట్ అర్జున్ “మీది థౌసండ్ రెండు లివర్లు ఎక్స్‌ట్రా” డైలాగ్ చెప్పాలంటూ కుమారి ఆంటీ ని అడిగాడు.ఆ విధంగా ఈమెకు ఘన స్వాగతం లభించింది.
నిజానికి స్టార్ యాంకర్ సుమ( Suma ) కూడా కుమారి ఆంటీ ని ఇమిటేట్ చేస్తూ, కుమారి ఆంటీ లాగా డైలాగులు చెబుతూ రీల్స్ చేసింది.ఆమె డైలాగులతో ఒక డీజే సాంగ్ కూడా రెడీ అయిపోయింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఆమెపై రీల్స్, మీమ్స్, ఇంకా జోకులు ఎన్నో వస్తున్నాయి.ఇలా మొత్తం మీద సోషల్ మీడియా అంతా ప్రస్తుతం కుమారి ఆంటీ చుట్టూనే తిరుగుతోంది.
అయితే ఈ పాపులారిటీని చూసుకొని ఆమె మురిసిపోతూ ఫుడ్ స్టాల్ చక్కగా రన్ చేయకపోతే జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉంది.ఆమె పొట్ట నింపేది ఫుడ్ స్టాల్ మాత్రమే కాబట్టి దానిపైనే ఆమె శ్రద్ధ పెట్టాలి.యూట్యూబ్, టీవీ ఛానల్స్, పేపర్లు ఇలా వివిధ మాధ్యమాలకు సమయాన్ని కేటాయిస్తే చివరికి ఫుడ్ వ్యాపారాన్ని ఆమె సరిగ్గా రన్ చేయలేకపోవచ్చు.దానివల్ల నష్టపోయేది ఆమే.ఆ సమయంలో ఒక్క సోషల్ మీడియా పర్సన్ కూడా ఆమెను పట్టించుకోడు.ఈ విషయం కుమారి ఆంటీ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండటం మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.