అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత దాడి ఘటన తీవ్రకలకలం సృష్టిస్తోంది.మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతుపై చిరుతపులి దాడి చేసింది.
గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన సమయంలో రైతు రామ్మూర్తిపై చిరుత దాడి చేసింది.ఈ దాడిలో రైతుకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.మరోవైపు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.
అలాగే సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.