హనుమాన్ మూవీ( Hanuman movie ) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.ఈ సినిమా కలెక్షన్లు స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఉన్నాయి.
ఓవర్సీస్ లో హనుమాన్ మూవీ అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకోగా ఈ రికార్డ్ హాట్ టాపిక్ అవుతోంది.ఓవర్సీస్ లో టాప్10 సినిమాల జాబితాలో ఈ సినిమా నిలిచింది.
విడుదలైన 4 రోజుల్లోనే హనుమాన్ ఓవర్సీస్ టాప్10 సినిమాల జాబితాలో నిలవడం గమనార్హం.
హనుమాన్ ఇప్పటివరకు 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.త్వరలో ఈ సినిమా ఆదిపురుష్, సాహో సినిమాలు సాధించిన కలెక్షన్లను సులువుగా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో బాహుబలి2 ( Bahubali 2 )మూవీ టాప్ లో ఉంది.
20 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఈ సినిమా నంబర్1 స్థానంలో ఉంది.ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఉంది.
ఈ సినిమా ఫుల్ రన్ లో 14.3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.సలార్, బాహుబలి1, అల వైకుంఠపురములో, రంగస్థలం, భరత్ అనే నేను తర్వాత స్థానాలలో ఉన్నాయి.ఓవర్సీస్ బయ్యర్లకు ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది.
హనుమాన్ మూవీ పెద్ద సినిమాల రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది.హనుమాన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.తేజ సజ్జా ప్రశాంత్ వర్మ( Teja Sajja , Prashant Varma ) హనుమాన్ సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకుల మెప్పు పొందారో చెప్పాల్సిన అవసరం లేదు.హనుమాన్ మూవీ సంచలనాలు మరికొన్ని రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది.
హనుమాన్ మూవీ విజువల్ ఎఫెక్స్ట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.హనుమాన్ మూవీకి లాంగ్ రన్ ఉండే అవకాశం అయితే ఉంది.