నల్లగొండను నడిపే అమాత్యులు ఎవరో...?

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ప్రస్తుత ఊపందుకుంది.సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ ​పార్టీ అగ్ర నేతలకు ఏ పదవి వరిస్తుందోనని కాంగ్రెస్​ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

 Who Will Get Minister Post From Nalgonda Constituency Congress Leaders Details,-TeluguStop.com

మొత్తం 11 స్థానాలు గెలిచి సత్తా చాటిన నేతలకు కీలక పదవులే లభిస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలంతా సుమారు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వాళ్లే కావడం గమనార్హం.

మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ఈసారి పోటీ చేయలేదు.ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు కుందూరు జయవీర్‌రెడ్డి అవకాశం ఇచ్చారు.

ఆయన గతంలో హోంశాఖ మంత్రిగానే కాకుండా 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు.అంతకుముందు 2009లో రద్దయిన చలకుర్తి నియోజకవర్గం నుంచి మొత్తంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మాజీ మంత్రి,పీసీసీ మాజీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఆయన కోదాడ నియోజకవర్గం నుండి 2 సార్లు,హుజూర్ నగర్ నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.నల్లగొండ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.ఆ వెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికలలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.అంతేకాకుండా రేవంత్ రెడ్డిని పీసీసీగా ఎంపిక చేసే సమయంలో కోమటిరెడ్డి కూడా ఆ పదవికి పోటీపడ్డారు.

కోమటి రెడ్డి బ్రదర్స్ కి ఉమ్మడి జిల్లాలో మాస్ లీడర్లుగా పేరు ఉంది.కానీ,ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.అందుకే సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డికే పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.అదే క్రమంలో కోదాడ నుంచి ఎంపికైన ఎన్.

పద్మావతి 2014లో కోదాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఆ తర్వాత 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

Telugu Addanki Dayakar, Balu Naik, Congress, Jana, Komativenkat, Kundurujayaveer

ప్రస్తుతం అదే నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.మహిళా కోటలో పద్మావతి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా ఈమెకి ఇవ్వడమనేది అసాధ్యం అనే చర్చ కూడా సాగుతుంది.దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేనావత్ బాలు నాయక్ ఎన్నికయ్యారు.

జెడ్పీటీసీగా ప్రారంభమైన రాజకీయ జీవితం ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్‌గా ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.గిరిజన కోటాలో బాలు నాయక్ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది.

సీఎల్పీ సమావేశంలో ఇప్పటికే ఒకరిద్దరి పేర్లు కూడా మంత్రి పదవులకు ప్రపోజల్ చేసి అధిష్టానానికి పంపినట్టు వినికిడి.ఎమ్మెల్సీ కోటాలో అద్దంకి దయాకర్ కూడా మంత్రి పదవి ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్‌ అసెంబ్లీ టికెట్టు మందుల సామేలుకు కేటాయించిన సందర్భంలో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పని చేస్తానని బహిరంగంగా ప్రకటించి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేసే క్రమంలో అద్దంకిని పెద్దల సభకు పంపి అటు నుంచి మంత్రివర్గంలోనికి తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ప్రచార సందర్భంలో కూడా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి దయాకర్ కు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని బహిరంగంగానే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ఆ నేపథ్యంలోనే దయాకర్‌ కు గుర్తింపు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే జిల్లాకు మెజార్టీ స్థాయిలో మంత్రి పదవులు దక్కి అవకాశం కూడా లేకపోలేదు.

ఉమ్మడి ఏపీలో జిల్లా నుంచి క్యాబినెట్లో రెండు బెర్త్లు దక్కాయి.2004లో వైఎస్ఆర్ క్యాబినెట్లో హోం మంత్రిగా జానారెడ్డి పనిచేశారు.2009లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా చేశారు.వైఎస్ మరణానంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లోనూ వెంకటరెడ్డి కొనసాగారు.ఉద్యమ నేపథ్యంలో తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేశారు.అదే టైంలో జానారెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది.

మంత్రిగా ఉంటూనే జానారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.టీడీపీ హయాంలో ఎలిమినేటి మాదవరెడ్డి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో 11మందికి చోటు ఉండొచ్చని తెలుస్తోంది.మంత్రులుగా భట్టి,ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు,సీతక్క, పొన్నం ప్రభాకర్‌, రాజనర్సింహ,పొంగులేటి, తుమ్మల,జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందులో ఉమ్మడి నల్లగొండ నుండి ఉత్తమ్,కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెర్త్ ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube