తెలంగాణలో కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఉదయమే హైదరాబాద్ కు చేరుకున్నారు.వీరికి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
కాగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి పలువురు నేతలను, ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పక్క రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.







