అక్టోబర్ 7వ తారీకు నుండి ఇజ్రాయెల్.హమాస్ మిలిటెంట్( Israel vs Hamas ) ల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దక్షిణ భూభాగంలో అక్రమంగా చొరబడి ఇజ్రాయెల్ పౌరులను చంపడంతో పాటు కొంతమందిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లిపోయారు.అదే సమయంలో కొంతమంది సైనికులను కూడా చంపడం జరిగింది.
దీంతో దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా వారం రోజులకు పైగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజా( Israel Defense Force )లో హమాస్ స్థావరాలపై బాంబులతో విరుచుకుపడుతూ ఉంది.
ఇదే సమయంలో ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేస్తూనే ఉన్నారు.
అయితే వీటిలో ఎక్కువ రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్( Iron Dome ) ఆకాశంలోనే నిర్మూలించడం జరిగింది.చాలావరకు ఉగ్రవాదులు గత కొన్ని సంవత్సరాల నుండి ప్రయోగిస్తున్న రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డుకోవడం జరిగింది.అయితే ఈ టెక్నాలజీ ద్వారా ఒక్కో రాకెట్ ని అంతం అందించాలంటే 40 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో ఇప్పుడు ఇజ్రాయెల్ సరికొత్త ఆయుధాన్ని యుద్ధభూమిలోకి దింపింది.
విషయంలోకి వెళ్తే కటింగ్ ఎడ్జ్ కలిగిన ఐరన్ బీమ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది.ఇది గాలిలోనే లేజర్( Laser System ) ద్వారా ఇజ్రాయెల్ లోకి వచ్చే రాకెట్లను ఆపేయడం జరుగుద్ది.
ఐరన్ బీమ్ ప్రత్యేకత ఏమిటంటే 100 కిలో వట్స్ పవర్ రన్ చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగింది.ప్రజెంట్ హమాస్ మిలిటెంట్ లతో పాటు పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ దేశాలతో కొన్ని ఉగ్రవాద సంస్థల నుండి ప్రమాదం పొంచి ఉండటంతో ఇజ్రాయెల్.
ముందు జాగ్రత్తగా ఈ ఐరన్ బీమ్ లేజర్ టెక్నాలజీ( Iran Beam Laser technology )ని యుద్ధభూమిలోకి తీసుకురావడం జరిగింది.ఐరన్ డోమ్ కంటే తక్కువ ఖర్చుతో ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా రాకెట్లను ఇజ్రాయెల్ ఆకాశంలోనే నిర్మూలించగలుగుతుంది.