యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE )లో 2024 జనవరి 1వ తారీఖు నుంచి కొత్త చట్టం అమల్లోకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.దీనిలో భాగంగా ఎమిరేట్ పరిధిలోని రాస్ అల్ ఖైమాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌పై బ్యాన్ విధిస్తున్నట్లు సంబంధిత అధికారులు తాజాగా ఓ స్థానిక మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది.
ఎమిరేట్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ బుధవారం ఈ కొత్త చట్టం విధివిధానాలను వివరించడం జరిగింది.ఇది 2023 ప్రారంభంలో ప్రకటించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై పాన్-యూఏఈ బ్లాంకెట్ బ్యాన్‌కు అనుగుణంగా వస్తుందని పేర్కొంది.
సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రాస్ అల్ ఖైమా( Ras Al Khaimah ) పాలకుడు అయినటువంటి హిజ్ హైనెస్ షేక్ సౌద్ బిన్ షకర్ అల్ ఖాసీమీ 2023లో జారీ చేసిన చట్టం నం.04 ప్రకారం, ఈ ప్లాస్టిక్ వినియోగంపై బ్యాన్‌ను 2024 జనవరి 1 నుంచి ఎమిరేట్‌లో నిషేధించడం జరుగుతుందని తెలుస్తోంది.మరోవైపు అబుదాబిలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై 2022 జూన్ 1వ తారీఖు నుంచి బ్యాన్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.అలాగే దుబాయిలో 2022 జూలై 1 నుంచి, షార్జాలో 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌పై నిషేధం అమల్లోకి రావడం విశేషం.
కాగా ప్రపంచ దేశాలు ఇపుడిపుడే ప్లాస్టిక్ వాడకం పైన పరిధిలు విధించుకుంటున్నాయి.మరోవైపు మనదేశంలో కూడా మెల్లమెల్లగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం చాలా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు.ఇక్కడ మెట్రో నగరాల్లో మొదలైన ఈ మార్పు మెల్ల మెల్లగా ఇపుడు పల్లెలకు కూడా పాకుతుంది.పల్లెల్లో ఒకటి రెండు కిరాణా షాపులలో కూడా ప్లాస్టిక్ నిషేదాన్ని మొదలు పెట్టడం గమనార్హం.