మన అందాన్ని రెట్టింపు చేసి చూపించే వాటిలో జుట్టు ఒకటి.ఒత్తైన పొడవాటి జుట్టు ( Long hair )మగువలను మరింత అట్రాక్టివ్ గా చూపిస్తుంది.
అందుకే అటువంటి జుట్టు కోసం చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు.జుట్టును ఒత్తుగా పొడుగ్గా పెంచుకునేందుకు తోచిన ప్రయత్నాలన్ని చేస్తుంటారు.
మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించినా చాలు మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా మారడం ఖాయం.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఉడికించిన రైస్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, అర కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe Vera Gel )ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే మీ కురులకు చక్కని పోషణ అందుతుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.
జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.పైగా ఈ రెమెడీ వల్ల మీ కురులు స్మూత్ అండ్ సిల్కీ గా మారతాయి.
జుట్టు చిట్లడం విరగడం వంటి సమస్యలు సైతం తగ్గు ముఖం పడతాయి.