ఎల్ఐసి ఇన్సూరెన్స్ కడితేనే క్రాప్ లోన్ ఇస్తామంటున్నారు బిజెపి( BJP ) మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్ఐసి ఇన్సూరెన్స్ కడితేనే క్రాప్ లోను మంజూరు చేస్తామని రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిబంధనలు పెడుతున్నారని మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ( Ponnala Tirupati Reddy )అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు గురువారం వెళ్లిన రైతులకు రుణమాఫీ డబ్బులు అడగగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ కడితేనే రుణమాఫీ డబ్బులు ఇవ్వడం జరుగుతుందని బ్యాంకు మేనేజర్ కరాకండిగా చెప్పడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పట్ల దురుసుగా మాట్లాడుతున్న మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు.అదేవిధంగా జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు.
లేనియెడల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ ను వివరణ కోరగా నేను డ్రైవింగ్ లో ఉన్నానని మాటను దాటవేశాడు.