రాజన్న సిరిసిల్ల జిల్లా:విజ్ఞాన్ పాఠశాల పూర్వ విద్యార్థికి పోలీస్ ఉద్యోగం రావడం పట్ల విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివిన తాడ మల్లికార్జున్ బిఎస్ఎఫ్ ( Mallikarjun BSF ) పోలీస్ ఉద్యోగం పొందగా గురువారం పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ , ఉపాధ్యాయులు సన్మానించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ లతీఫ్ మాట్లాడుతూ తాడ శ్రీనివాస్ రెడ్డి తనయుడైన మల్లికార్జున్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తమ పాఠశాలలో చదువుకోవడం జరిగిందన్నారు.పాఠశాల స్థాయి నుండే మల్లికార్జున్ చదువుతోపాటు క్రీడల్లో రాణించడం జరిగిందన్నారు.
తమ పాఠశాలలో ఉన్నప్పుడే రాష్ట్రస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలకు ఎంపికవ్వడం జరిగిందన్నారు.చిన్నతనం నుండి విద్యార్థులు చదువుతోపాటు తమ లక్ష్యాన్ని పెట్టుకుంటే గురువులతోపాటు తల్లితండ్రి ఆశయాలను సాధించవచ్చు అన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, ఉపాధ్యాయ బృందం మల్లికార్జున్ ను అభినందించారు.