రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ను వారి నివాసంలో ఎల్లారెడ్డి పేట మండల భాజపా నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మండల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఎంపీ ని మండల పర్యటనకు ఆహ్వానించారు.అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించి అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ ప్రకారం వస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
నారాయణపూర్ గ్రామంలోని రామాలయంలో పూర్ణకుంభ స్వాగతం, గ్రామపంచాయతీ ఆవరణంలో పార్టీ జెండా ఆవిష్కరణ, బైక్ ర్యాలీ మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించ నున్నట్లు భాజపా నాయకులు తెలిపారు.ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసిన వారిలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంతుర్తి శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు నమిలికొండ శ్రీకాంత్, బీజేవైఎం సీనియర్ నాయకులు మానుక కుమార్ యాదవ్, సూర రాజు, లద్దునూరి రాజు, జెల్ల బాలకిషన్, తదితరులు ఉన్నారు.