హెచ్ 1 బీ వీసాల( H-1B visas ) పరిమితిని పెంచాలని యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్‌ను( Alejandro Mayorkas ) కోరారు భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదర్.( Shri Thanedar ) తద్వారా భారతదేశం నుంచి ఎక్కువమంది ఐటీ నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు రావడానికి వీలు కలుగుతుందన్నారు.
ఈ మేరకు 2024 ఆర్ధిక సంవత్సరానికి గాను హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కోసం బడ్జెట్‌పై జరిగిన హౌస్ కమిటీ విచారణ సందర్భంగా థానేదర్ ఈ వ్యాఖ్యలు చేశారు.దేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దడంలో విస్తృత వైఫల్యానికి అమెరికా సరిహద్దు భద్రత కూడా కారణమన్నారు.
మాతృదేశాన్ని సురక్షితంగా వుంచడంలో కీలకమైన సరిహద్దుకు మించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విస్తృత శ్రేణి మిషన్లను కలిగి వుందని థానేదర్ అన్నారు.
ఇక దేశంలోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) సిబ్బంది దుర్భర పరిస్ధితుల్లో పనిచేస్తున్నారని థానేదర్ తెలిపారు.
ఇందులోని ఫ్రంట్‌లైన్ అధికారులు 30 శాతం తక్కువ వేతనంతో పాటు ఇతర ఫెడరల్ ఉద్యోగులతో పోల్చినప్పుడు తక్కువ కార్మిక రక్షణను పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యలను పరిష్కరించడానికి రిపబ్లికన్ల ప్రతిపాదనలు చాలా తక్కువగా వున్నాయని థానేదర్ ఎద్దేవా చేశారు.
అదృష్టవశాత్తూ గతేడాది డెమొక్రాట్లు పలు కార్మిక హక్కులతో పాటు టీఎస్ఏ కార్మికులకు వేతనాల పెంపునకు అనుకూలంగా ఓటు వేశారని ఆయన గుర్తుచేశారు.ఇది జూలైలో అమలులోకి వస్తుందని శ్రీథానేదర్ తెలిపారు.
ఇకపోతే.ఆర్ధిక మాంద్యం దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా( America ) వణుకుతోంది.ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.రానున్న రోజుల్లో ఈ పరిస్ధితి మరింత తీవ్రంగా వుండే అవకాశం వుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న విదేశీ కార్మికుల్లో భారతీయులు కూడా వున్నారు.గూగుల్ , మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలలో లే ఆఫ్‌ల కారణంగా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్నారు.
మరోవైపు.ఉద్యోగం పోయిందన్న బాధ కంటే హెచ్1బీపై వున్న వారికి 60 రోజుల నిబంధన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో వుంటున్న విదేశీ ఉద్యోగులు .తమ ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా మరో ఉద్యోగంలో చేరాల్సి వుంటుంది.లేని పక్షంలో అట్టివారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనలో వున్నారు.ఈ క్రమంలోనే 60 రోజుల నిబంధనను 180 రోజులకు పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సిలికాన్ వ్యాలీకి చెందిన అమెరికా చట్టసభ సభ్యులు అప్రమత్తమయ్యారు.
హెచ్ 1 బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయినా వారు అమెరికాలోనే కొనసాగేందుకు వీలు కల్పించాలని కోరుతూ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)కి లేఖ రాశారు.