హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం చెలరేగింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పత్రాలు దర్శనమిస్తున్నాయి.
ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి కాలేదు.దీంతో మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు.?’ అంటూ పోస్టర్లు వెలిశాయి.ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారంటూ ప్రశ్నించారు.
ఐదు సంవత్సరాలైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ 40 శాతం కూడా పూర్తికాలేదని పోస్టర్లలో పేర్కొన్నారు.హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిలో ఫ్లై ఓవర్ పిల్లర్లకు గుర్తు తెలియని వ్యక్తులు అంటించారని తెలుస్తోంది.