రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ రావు సూచన మేరకు శనివారం వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు,రంగంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల అధ్యక్షులు పరమాల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో రంగంపేట గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పరమాల మల్లేశం మాట్లాడుతూ కర పత్రాలు పంచుతూ ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ వివరిస్తూ ఈ కరపత్రాలలో చేర్చడం జరిగింది.
దీని ద్వారా ప్రతి ఒక్కరు చదువుకొని తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎన్నో సంక్షేమం పథకాలు తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు.రెండు రూపాయల కిలో బియ్యం గాని, సభ్యత్వాలు గానీ, ట్రాన్స్ఫార్మర్లు, వాటర్ ట్యాంకులు, సిసి రోడ్లు, ఇంటింటికి సైకిల్లు,రజకులకు ఇస్త్రీ పెట్టెలు,బకెట్లు,పక్క గృహాలు,మహిళా డ్వాక్రా రుణాలు, అంగన్వాడి కేంద్రాలు, గవర్నమెంట్ హాస్పిటల్,వితంతువులకు పింఛన్లు,వృద్ధులకు పింఛన్లు, ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబునాయుడు అని అన్నారు.
ఈ పార్టీని ప్రతి ఒక్కళ్ళు ఆదరించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పేదలకు అండగా ఉంటూ పేద ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బరిగల కృష్ణ,బరిగల శంకర్, మల్లారపు రవి, దేశరాజు లచ్చయ్య,అమృనాయక్,చిన్న కాశిరాం తదితరులు పాల్గొనడం జరిగింది.