తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది.కరోనా కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు.
ఈ సారి భక్తుల మధ్య నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టింది.
సెప్టెంబర్ 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఆలయ మాడవీధుల్లో వివిధ రకాల వాహనసేవల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.