నల్గొండ జిల్లా:29 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్.స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు.
తల్లిదండ్రుల కోరిక మేరకు ఇళ్లకు పంపించిన యాజమాన్యం.భయపడాల్సిన అవసరం లేదంటున్న పాఠశాల ప్రిన్సిపాల్.
ఆందోళనలో తల్లిదండ్రులు.
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారిని హోం క్వారైంటైన్ నిమిత్తం వారి వారి ఇళ్ళకు తీసుకెళ్లిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.కొండమల్లేపల్లిలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఒకే రోజు 29 మంది విద్యార్థినులకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ కావడంతో విద్యార్థినిలు,తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.29 మందిలో ఒకరు 7 వతరగతి,ఒకరు 10 తరగతి కాగా మిగిలిన వారందరూ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిలు కావడం గమనార్హం.గురుకుల పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి ప్రస్తుతం 560 మంది విద్యార్థినులు ఉన్నారు.ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ కొందరు విద్యార్థినులకు స్వల్ప కరోనా లక్షణాలుండటంతో సుమారు 150 మందికి పరీక్షలు చేయించగా అందులో 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు.
వారిని హోం క్వారైంటైన్ నిమిత్తం తల్లిదండ్రులు కోరిక మేరకు ఇళ్ళకు పంపించడం జరిగిందని తెలిపారు.పాజీటీవ్ వచ్చిన విద్యార్థినులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని,వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని,ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలియజేశారని అన్నారు.
పాఠశాల ప్రాంగణం మొత్తం శానిటైజేషన్ చేయించామని,విద్యార్థినుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు.