ట్యాంక్ బండ్ పై మంత్రి మాటా-మంతి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేటకు మణిహారంగా ఉన్న సద్దుల చెరువు ట్యాంక్ బండ్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.ట్యాంక్ బండ్ పై కలియతిరుగుతూ పాదచారులకు,విజిటర్స్ కు కావాల్సిన సదుపాయాలపై మంత్రి ఆడిగి తెలుసుకున్నారు.

 Minister Mata-manti On Tank Bund-TeluguStop.com

తమకు సౌకర్యవంతంగా,ఆహ్లాదకరంగా ఉండేలా సద్దుల చెరువును ట్యాంక్ బండ్ లా తీర్చిదిద్దిన మంత్రికి పాదచారులు,యువకులు కృతజ్ఞతలు తెలిపారు.ట్యాంక్ బండ్ పై కూర్చోవడానికి వీలుగా సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా,దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

త్వరలోనే ట్యాంక్ బండ్ పై అధునాతన సీటింగ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.గంటకి పైగా ట్యాంక్ బండ్ పై కలియతిరిగిన మంత్రి యువకులు,చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

అనంతరం లోయర్ సద్దుల చెరువు ట్యాంక్ బండ్ క్రింద సాగుతున్న కాలువ పనులను పరిశీలించి,త్వరగా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మంత్రి వెంట జడ్పిటిసి జీడీ భిక్షం,తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube