ప్రస్తుత కాలంలో ఫోన్ లేకపోతే పనే జరగడం లేదు.ఏ పని చేయాలన్నా గాని ప్రతి ఒక్కరికి ఫోన్ చాలా అవసరం.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.అయితే వాటిని ఉపయోగించే క్రమంలో కళ్లకు ఏ మాత్రం చిన్న ఒత్తిడి అనిపించినా సరే ఫోన్ లో డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తుంటారు.
అలా డార్క్ మోడ్ పెట్టడం వలన కళ్లకు శ్రమ తగ్గడంతోపాటు ఫోన్ కూడా మంచిగా వర్క్ చేస్తుంది.అయితే ఈ డార్క్ మోడ్ ఫిచర్ ను గతేడాది గూగుల్ సెర్చ్ లో మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజాగా ఇప్పుడు ఈ డార్క్‌మోడ్ ను మరింత డార్క్ గా మార్చి మనకు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.అయితే ఇప్పటివరకు గూగుల్ సెర్చ్ లో డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే కొన్ని స్క్రీ న్లు గ్రే రంగులో కనిపిస్తుంటాయి.
అయితే ఇప్పుడు ఈ ఫీచర్ అప్డేట్ చేసిన తర్వాత డార్క్ మోడ్ పిచ్ భాగం అనేది బ్లాక్ రంగులోకి మారుతుందట.అయితే ఈ ఫీచర్‌ను గూగుల్ కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
కాగా ఈ డార్క్ మోడ్ ఫిచర్ కోసం కంప్యూటర్ లో గూగుల్ సెర్చ్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి google.com అని టైప్ చెయండి.అ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అప్పీ యరెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయడమే.ఈ కొత్త ఫీచర్ ను గనుక మీరు ఉపయోగిస్తున్నట్టయితే మీ ఎకౌంట్ కూడా సురక్షితంగా ఉన్నట్టే అన్నమాట.రానున్న రోజుల్లో ఈ ఫిచర్ అందరికి అందుబాటులోకి రానుందని తెలుస్తుంది.