అదృష్టం తలుపు తడితే.దురదృష్టం తలుపు తెరిచే వరకు బాదుతూనే ఉంటుంది అంటారు పెద్దలు.
కొన్ని విషయాలను పరిశీలిస్తే అది ముమ్మాటికీ వాస్తవం అనిపిస్తుంది.ఇదే సూత్రం వర్తిస్తుంది కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి.
పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించిన ఈ అమ్మడు కెరీర్ ప్రస్తుతం జీరో స్టేజ్ లోనే కొనసాగుతుంది.ఒకప్పుడు బ్యూటీ కాంటెస్ట్ లో యువరాణిగా వెలిగింది ఈ అమ్మడు.
ఆ తర్వాత మోడలింగ్ నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చింది.వచ్చీరావడం తోనే కన్నడ రాక్ స్టార్ యశ్ తో కలిసి కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సినిమాలో నటించింది.
ఈ సినిమా తర్వాత శ్రీనిధి కెరీర్ ఆకాశమే హద్దుగా ఉంటుందని అందరూ భావించారు.కానీ అనుకున్నది ఒకటి అయితే అయ్యింది మరొకటి.
ఆ సినిమా తర్వాత తనకు మరే అవకాశం రాలేదు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ సీక్వెల్ లో మాత్రం నటిస్తోంది.
తెలుగు, తమిళం నుంచి కూడా ఆమెకు ఇప్పటికీ ఆఫర్లు రావడం లేదు.
శ్రీనిధి శెట్టి తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన చాలా మంది కన్నడ సినీ తారలు ఇప్పుడు ఆయా సినిమా పరిశ్రమల్లో టాప్ పొజిషన్లో ఉన్నారు.
రష్మిక మందాన లాంటి హీరోయిన్లు సౌత్ టాప్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు.బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నారు.
ఉప్పెనతో తెలుగు సినిమా రంగానికి పరిచయం అయిన కృతి శెట్టి వరుస హిట్లతో దూసుకుపోతుంది.క్రేజీ ఆఫర్లతో హల్ చల్ చేస్తుంది.
కానీ వీరికంటే గొప్ప బ్యాగ్రౌండ్ ఉన్న శ్రీనిధి కెరీర్ మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ముందుకు సాగుతోంది.కన్నడలో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా.టాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం ఇప్పటికీ అడుగు పెట్టలేక పోతుంది.అందానికి అందం, నటనలో మంచి టాలెంట్ ఉన్నా.ఎందుకో ఈమెను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు.
తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న కేజీఎఫ్-2 సినిమా త్వరలో విడుదల కాబోతుంది.ఈ సినిమా తర్వాత అయినా శ్రీనిధి పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి.ఈ క్రేజీ మూవీ ఏప్రిల్14న జనాల ముందుకు రాబోతుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించ డబ్బింగ్ పూర్తి చేసినట్లు శ్రీనిధి వెల్లడించింది.దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.