వన్య మృగాల్లో ఖడ్గ మృగం కూడా ఒకటి.దీని గురించి అందరు వినే ఉంటారు.
అయితే దాని కొమ్ము గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఖడ్గ మృగం కొమ్ము గురించి మీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి.
ఖడ్గ మృగం కొమ్ములు చాలా ఖరీదైనవి అట.ఎంత ఖరీదైనవి అంటే వీటి కంటే బంగారం చౌకగా వస్తుందట. అంత ఖరీదైనవిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా.?
ఖడ్గ మృగం కొమ్ములు అంత ఖరీదు ఎందుకు ఉంటుంది.దీని కొమ్ములు లక్షల విలువ పలకడం వల్ల వేటగాళ్లు వీటిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.అయితే ఖడ్గ మృగాలు వేటగాళ్లకు బలి అవ్వకుండా ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్న ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.ఖడ్గ మృగం కొమ్ముల్లో కెరాటిన్ ఉంటుందట.దీని ధర బంగారం కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుంది.
ఈ కెరాటిన్ కారణంగానే ఖడ్గ మృగాల కొమ్ములకు చాలా ధర పలుకుతుంది. చైనా లో దీనిని మ్యాజికల్ మెడిసిన్ అంటారు.
ఈ కెరాటిన్ ను జుట్టుకు సంబంధించిన చికిత్సలో వాడుతారు.అంతేకాదు వీటి కొమ్ములను పొడిగా తయారు చేసి అనేక ఔషధాల్లో ఉపయోగిస్తారు.
క్యాన్సర్ వ్యాధి నుండి హ్యాంగోవర్ వరకు చాలా రకాల మందుల తయారీలో ఈ కొమ్ములను ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.
అందుకే ఈ కొమ్ములు లక్షల్లో ధర పలుకుతాయి.ఖడ్గ మృగం కొమ్ములు కోసిన మళ్ళీ పెరుగుతాయి.ఇక్కడ ఒక కొమ్ము ధర లక్ష రూపాయలు పలుకుతున్నట్టు తెలుస్తుంది.
గత సంవత్సరం నివేదికల ప్రకారం కొమ్ములున్న102 ఖడ్గ మృగాలను వేటాడినట్టు నివేదికలు చెబుతున్నాయి.ఇప్పటికే వేటగాళ్లు 32 మృగాలను చంపేసినట్టు అధికారులు చెబుతున్నారు.
నేడు ఖడ్గ మృగాలు అంతరించి పోతున్నాయి.ప్రస్తుతం మన దేశంలో 3000 వేలకు పైగా ఖడ్గ మృగాలు అడవిలో ఉన్నట్టు చెబుతున్నారు.
ఇందులో 200 ఖడ్గ మృగాలు అస్సాం లో ఉన్నాయట.