ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం కేసీఆర్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు అన్నీ కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు సాగుతూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కేసీఆర్ మాత్రం చాలా అరుదుగా ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తున్న పరిస్థితి ఉంది.కేసీఆర్ స్పందించక పోవడంతో ఇక ఇదే అదనుగా బీజేపీ లాంటి పార్టీలు తమ బలాన్ని పెంచుకుంటూ టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయం మేమే అనే విధంగా ప్రజలకు సంకేతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది.
అయితే గత మొదటి సార్వత్రిక ఎన్నికలో కూడా అన్నీ పార్టీలు ఏకమై కేసీఆర్ కు వ్యతిరేకంగా పోటీ చేసినా అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ గెలుపొందిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు నేడు నెలకొన్నాయి.
అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్న తరుణంలో ఇప్పుడే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించకుండా సరైన సమయంలో ప్రతి ఒక్క విమర్శను తనకు అనుకూలంగా ప్రచారాయుధంగా మార్చుకుంటారనే విషయం తెలిసిందే.అయితే బీజేపీ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసేలా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని టీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటినే తన ప్రచారాయుధంగా మలుచుకునే అవకాశం ఉంది.అందుకే ప్రతిపక్షాలు ఎంతగా విమర్శించినా చాలా ఆలోచించి స్పందిస్తూ చాకచక్యంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రతిపక్షాలకు రాజకీయంగా కౌంటర్ ఇవ్వడంలో టీఆర్ఎస్ కాస్త వెనకబడి ఉన్నా ఎవరూ ఊహించని సమయంలో కేసీఆర్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది.ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల వాతావరణం మునుపెన్నడూ లేనంత తీరుగా ఉండే అవకాశం ఉంది.
మరి కేసీఆర్ రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది.