ప్రసవం అనంతరం ప్రతి తల్లి కామన్ గా ఎదుర్కొనే సమస్య స్ట్రెచ్ మార్క్స్( Stretch marks ).ముఖ్యంగా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఏర్పడుతుంటాయి.
ఇవి చూసేందుకు చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఈ క్రమంలోనే చాలా మంది స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మార్కెట్లో లభ్యమయ్యే స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.కొందరు వేలకు వేలు ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు గుడ్లు తీసుకుని పగలకొట్టి పచ్చ సొనను మాత్రం సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ లో గుడ్డు పచ్చ సొన( Egg green yolk ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్( Corn flour ) వేసుకొని మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ సాయంతో మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొట్టపై అప్లై చేసుకుని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.అనంతరం స్వీట్ ఆల్మండ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ ను పొట్టపై అప్లై చేసుకుని కనీసం పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా మాయం అవుతాయి.పొట్ట వద్ద చర్మం టైట్ గా మారుతుంది.కాబట్టి ప్రసవం అనంతరం స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న మహిళలు తప్పకుండా ఈ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటించండి.స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా వదిలించుకోండి.
పైగా ఏ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.