రాజకీయాల్లో తొందరపాటు వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బీజేపీ అని వందకు వంద శాతం చెప్పవచ్చు.కేంద్ర ప్రభుత్వం ఎంతో కష్టం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి.
కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి పంటను కొనేది లేదని స్పష్టం చేసిన పరిస్థితిలో బండి సంజయ్ యాసంగిలో వరి ధాన్యం వేయండి కెసీఆర్ మెడలు వంచైనా వరి ధాన్యం కొనుగోలు చేయిస్తామని బండి సంజయ్ వాఖ్యలు కె సీఆర్ కు ఆగ్రహం తెప్పించడం, కేంద్రం నుండి కొనుగోలు చేస్తామని లెటర్ తీసుకరావాలని కేసీఆర్ విసిరిన సవాల్ కు బీజేపీ నుండి స్పష్టమైన సమాధానం రాలేదు.దీంతో కెసీఆర్ ఒక అడుగు ముందుకేసి నిర్వహించిన రైతు మహా ధర్నాతో కేంద్రం మరో సారి యాసంగి కొనేది లేదని స్పష్టం చేయడంతో బీజేపీ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోయింది.
అయితే ఈ విషయంపై నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటూ కేంద్రం నుండి వార్నింగ్ వచ్చింది అంటూ సోషల్ మీడియా పుకార్లు షికారు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఈ పుకార్లపై బీజేపీ నుండి పెద్దగా స్పందన రాకున్నా బండి సంజయ్ తన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గినట్టు బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలను స్టడీ చేసిన తరువాతే రాజకీయ పోరాటానికి, రాజకీయ విమర్శలకు దిగాలనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోందని టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.మరి ఈ ప్రచారం లో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని ప్రక్కకు పెడితే బీజేపీ మౌనం ఈ తరహా ప్రచారానికి బలం చేకూర్చిందని చెప్పవచ్చు.