టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ అయిపోవడానికి తమ సినిమాలని యూనివర్శల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కిస్తున్నారు.బాహుబలి స్ఫూర్తితో మన స్టార్స్ అందరూ పాన్ ఇండియా మీదనే ఫోకస్ పెట్టారు.
సినిమా హిట్ అయితే ఎక్కడి ప్రేక్షకులు అయినా కనెక్ట్ అవుతారని బాహుబలి, కేజీఎఫ్ విషయంలో ప్రూవ్ కావడంతో ఇక దిశగానే అందరూ అడుగులు వేస్తున్నారు.తారక్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా మీద ఫోకస్ చేశారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కావడం ఆటోమేటిక్ గా క్రేజ్ ఉంటుంది.అయితే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియన్ కాన్సెప్ట్ లతోనే సినిమాలు చేస్తున్నారు.
ఇక యంగ్ హీరోలు కూడా ఆ దిశగానే ఫోకస్ చేస్తున్నారు నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ మూవీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది.ఇక రీసెంట్ గా ఇళయదళపతి విజయ్ బీస్ట్ అనే సినిమాతో పాన్ ఇండియాపై ఫోకస్ పెట్టాడు.ఇక ఇప్పుడు లారెన్స్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.వెట్రిమారన్ అందించిన కథతో దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో లారెన్స్ ఒక సినిమా చేయబోతున్నాడు.
దీనికి అధికారమ్ అనే టైటిల్ ఫిక్స్ చేసి తాజాగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే లారెన్స్ ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.వాటిలో చంద్రముఖి సీక్వెల్ కూడా ఉండటం విశేషం
.