మూడో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన తమన్నా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.ఈ అమ్మడు శ్రీ అనే సినిమాతో కెరియర్ ప్రారంభించిన తరువాత హ్యాపీ డేస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

 Tamannaah Signed Third Web Series, 11 Hour, Tollywood, November Story, F3 Movie,-TeluguStop.com

తరువాత రచ్చ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏకంగా దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన హవాని కొనసాగిస్తుంది.

అడపాదడపా హిందీ, తమిళ్ సినిమాలు చేస్తున్న ఆమె స్టార్ ఇమేజ్ మాత్రం టాలీవుడ్ లోనే ఉంది.ప్రస్తుతం తమన్నా నటించిన సిటీమార్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక ఎఫ్3 షూటింగ్ దశలో ఉంది.

Telugu November Story, Tamannaah, Tollywood, Web-Movie

అలాగే మ్యాస్ట్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇదిలా ఉంటే ఈ మధ్య డిజిటల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తమన్నా 11 అవర్స్, నవంబర్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ వెబ్ సిరీస్ లు అనుకున్న స్థాయిలో డిజిటల్ ఆడియన్స్ ని మెప్పించ లేకపోయాయి.

అయినా కూడా డిజిటల్ స్క్రీన్ పై డిఫరెంట్ పాత్రలు చేసే అవకాశం వస్తూ ఉండటంతో తమన్నా దానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.ఈ నేపధ్యంలో తాజాగా ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పింది.

తెలుగు, హిందీ, తమిళ్ బాషలలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.సెప్టెంబర్ లో ఈ వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో అయినా తమన్నా డిజిటల్ స్క్రీన్ పై సక్సెస్ కొడుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube