మూడో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన తమన్నా
TeluguStop.com
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.
ఈ అమ్మడు శ్రీ అనే సినిమాతో కెరియర్ ప్రారంభించిన తరువాత హ్యాపీ డేస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
తరువాత రచ్చ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏకంగా దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తన హవాని కొనసాగిస్తుంది.
అడపాదడపా హిందీ, తమిళ్ సినిమాలు చేస్తున్న ఆమె స్టార్ ఇమేజ్ మాత్రం టాలీవుడ్ లోనే ఉంది.
ప్రస్తుతం తమన్నా నటించిన సిటీమార్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక ఎఫ్3 షూటింగ్ దశలో ఉంది.
"""/"/
అలాగే మ్యాస్ట్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య డిజిటల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తమన్నా 11 అవర్స్, నవంబర్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వెబ్ సిరీస్ లు అనుకున్న స్థాయిలో డిజిటల్ ఆడియన్స్ ని మెప్పించ లేకపోయాయి.
అయినా కూడా డిజిటల్ స్క్రీన్ పై డిఫరెంట్ పాత్రలు చేసే అవకాశం వస్తూ ఉండటంతో తమన్నా దానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.
ఈ నేపధ్యంలో తాజాగా ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పింది.
తెలుగు, హిందీ, తమిళ్ బాషలలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.సెప్టెంబర్ లో ఈ వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
మొత్తానికి ఈ వెబ్ సిరీస్ తో అయినా తమన్నా డిజిటల్ స్క్రీన్ పై సక్సెస్ కొడుతుందేమో చూడాలి.
ఆఫ్రికాలో భారతీయ ట్రావెల్ వ్లాగర్‌కు ఊహించని షాక్.. ఏం జరిగిందో మీరే చూడండి..