మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించి టాలీవుడ్ లో నిర్మాతలుగా పరిచయం అయ్యారు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు వస్తున్నాయి.
సినిమాలు వరుసగా వస్తున్నా కొద్ది మైత్రి వారి క్రేజ్ పెరుగుతూ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా మినిమం గ్యారెంటీ సినిమా అన్నట్లుగా టాక్ ఉంది.
అందుకే వారు వరుసగా సినిమా లను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మంచి కథలను ఎంపిక చేసేందుకు ఒక టీమ్ ను ఏర్పాటు చేసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు వీరు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో వీరి నుండి తెలుగు లోనే కాకుండా తమిళం మరియు హిందీ లో కూడా సినిమా లు వస్తున్నాయి.వచ్చే ఏడాది వీరి బ్యానర్ లో తమిళం లో విజయ్ హీరోగా ఒక సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక సినిమా లు రూపొందబోతున్నాయి.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ ఇలా స్టార్ హీరోలతో మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాలను నిర్మిస్తున్నారు.ఇప్పటికే కొన్ని పట్టాలు ఎక్కాయి.
మరి కొన్ని ఒకటి రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్నాయి.ఈ ఏడాదిలో మరిన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దకు వీరు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
వీరు ఈ రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న సినిమాల విలువ దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.ఇక ఈ సినిమాల వసూళ్లు మరియు బిజినెస్ దాదాపుగా రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.
బాలీవుడ్ లో కూడా ఏ నిర్మాణ సంస్థ ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తున్నది లేదు.మొదటి సారి ఈ సినిమాలతో మైత్రి మూవీ మేకర్స్ వారు దుమ్ము రేపుతున్నారు.
ఆ తర్వాత తర్వాత వీరి నుండి ఇంకా ఎన్నెన్ని సినిమాలు వస్తాయో చూడాలి.