టిక్ టాక్ భారతదేశంలో ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.ప్రస్తుతం ఉన్న యువతరంలో బహుశ టిక్ టాక్ వాడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు.
అలా ఒక్కసారిగా యువత టిక్ టాక్ కు అడిక్ట్ అయిన పరిస్థితుల్లో భారత ప్రభుత్వం దేశ భద్రత రీత్యా టిక్ టాక్ ను భారత ప్రభుత్వం నిషేధించింది.టిక్ టాక్ ద్వారా టిక్ టాక్ స్టార్లుగా చలామణి అయిన వాళ్ళు ఒక్కసారిగా కనుమరుగైనారు.
అలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దుర్గారావుకు మాత్రం టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత చాలా పేరొచ్చింది.వరుస టీవీ షోలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పాపులర్ అయిన దుర్గారావు ఈ మధ్య ఓ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే దుర్గారావు స్టేజి మీదకి వెళ్లిన తరువాత అదే ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి హాజరైన జగపతిబాబును ఓ కోరిక కోరాడు.జగపతిబాబు గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ని, నాతో కలిసి ఓ స్టెప్పు వేస్తారా అని దుర్గారావు ఏకంగా జగపతి బాబుని అడిగితే వెంటనే జగపతిబాబు కూడా అంగీకరించి స్టేజి మీద దుర్గారావుతో కలిసి జగపతిబాబు స్టెప్పులేశాడు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.జగపతి బాబు హుందాతనాన్ని సినిమా అభిమానులు ప్రశంసిస్తున్నారు.