దాదాపు మూడు దశాబ్దాల క్రితం తెలుగులో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు జయప్రద.ఏపీలోని రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి.బాల్యంలో డాక్టర్ కావాలని అనుకున్న జయప్రదకు సినిమాలంటే కూడా ఆసక్తి ఉండేది.1976 సంవత్సరంలో భూమి కోసం అనే సినిమా ద్వారా జయప్రద టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, కన్నడ భాషల్లో 300కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు.రామారావు, నాగేశ్వరరావు, కృష్ణలాంటి హీరోలకు జోడీగా జయప్రద నటించారు.
ప్రస్తుతం జయప్రద తెలుగులో రాజేంద్రప్రసాద్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు.ఒక ఇంటర్వ్యూలో జయప్రద మాట్లాడుతూ ఆసక్తికరమైన ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఇప్పటివరకు 8 భాషల్లోని సినిమాల్లో నటించానని.సాగరసంగమం సినిమాను రీమేక్ చేస్తే నటిస్తానని ఆమె అన్నారు.
సినిమ ఇండస్ట్రీలో అందగాడు శోభన్ బాబేనని.సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.ఏపీ ప్రజలకు సేవ చేయాలని భావించినా అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లానని ఆమె అన్నారు.చంద్రబాబు తన సేవలను గుర్తించలేదని.సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ కు కాకుండా చంద్రబాబుకు మద్దతు పలికి తప్పు చేశానని ఆమె అన్నారు.
కమల్ హాసన్ తనను రాజకీయాల్లోకి రావొద్దని సూచించారని కానీ ఇప్పుడు ఆయనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు.
తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద ఇతర ఇండస్ట్రీల్లో సైతం అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.రాజకీయాల్లో కూడా రాణించిన జయప్రద సినిమా రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో కూడా నటనకు మాత్రం దూరం కాలేదు.
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండే జయప్రద తెలుగుదేశం పార్టీతో తాను తెగదెంపులు చేసుకున్నట్టు వెల్లడించారు.