కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.ఎక్కడి పనులు అక్కడే పూర్తిగా నిలిచిపోయాయి.
ఆర్ధికపరంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక ఈ వైరస్ కారణంగా సినీ రంగం కూడా మూతపడింది.
సినిమా షూటింగ్‌లు మొదలుకొని, రిలీజ్‌ల వరకు అన్ని పనులను నిలిపివేశారు.
అయితే ఈ కరోనా వైరస్ ప్రభావంతో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా దెబ్బతిన్నది ఎవరంటే ఖచ్చితంగా ఇద్దరు యంగ్ హీరోల పేర్లు వినిపిస్తాయి.
యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా మార్చి 30న రిలీజ్ కావాల్సి ఉంది.అటు మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రం కూడా రిలీజ్ ఆగిపోయింది.
కరోనా వైరస్ కారణంగా ఈ రెండు సినిమాలను వాయిదా వేశారు.
ఈ ఇద్దరు హీరోలకు కూడా ఈ రెండు చిత్రాలు చాలా కీలకం అని చెప్పాలి.
వారి భవిష్యత్తు ఈ సినిమాలపై ఆధారపడి ఉంది.ఇక లాక్‌డౌన్ ఎత్తేసిన తరువాత కూడా వీరి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే భయం చిత్ర యూనిట్‌లలో నెలకొంది.