ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో నిత్యం తెరపై కనిపించే కత్తి మహేష్ ఈసారి సరికొత్త వివాదంతో తెరపైకి వచ్చాడు. అంతేగాక ఈ సారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జజగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తన అధికారిక పేస్ బుక్ ఖాతా ద్వారా జగన్మోహన్ రెడ్డి పై పలువురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారికి పచ్చి బూతులు తిట్టిన వారిపై ఉన్నంత ప్రేమ వారికి ఓట్లు వేసి గెలిపించినటువంటి దళిత, బలహీన వర్గాలపై లేదని అన్నారు.అంతేగాక వైకాపా పార్టీపై బడుగు బలహీన వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు.
అలాగే రాష్ట్రంలో తాజాగా ప్రవేశపెట్టిన అటువంటి అమ్మ ఒడి పథకంపై కూడా పలు విమర్శలు చేశారు.రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్ నిధులను అమ్మఒడి పథకం కోసం వినియోగించడం సరికాదని, అసలు ఏ ప్రాతిపదికన ఉపయోగిస్తారో ఒకసారి తమకు వివరించాలని కోరారు.
అయితే ఇది ఇలా ఉండగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కత్తి మహేష్ కి కొత్తేమీ కాదు.గతంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా పలు విమర్శలు చేసి కొంతకాలం టాలీవుడ్ సినీ పరిశ్రమకు దూరమయ్యాడు.అయితే ఎప్పుడూ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే కత్తి మహేష్ ఒక్కసారిగా రివర్స్ అవడం చూస్తుంటే మల్లె ఎదో పెద్ద వివాదంతోనే తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది.