ఒకప్పుడు తన సినిమాలు వస్తున్నాయంటే దాదాపుగా పెద్ద హీరోలు సైతం తమ చిత్రాలను వాయిదా వేసుకునే వాళ్లు.అంత ఫెమ్ ఉన్నటువంటి నటి షకీలా.
తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నటిగా ఎదిగి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించింది షకీలా.అయితే గత కొద్ది కాలంగా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు షకీలా కనిపిస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా షకీలా ప్రస్తుతం “షకీలా రాసిన మొదటి కుటుంబ కథా చిత్రం” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా నటి షకీలా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్నఇంటర్వ్యూలో పాల్గొంది.
ఇందులో భాగంగా పలువురు తెలుగు హీరోల గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు, నాని తదితరుల గురించి చెప్పుకొచ్చింది.అయితే యాంకర్ మరి అల్లు అర్జున్ గురించి ఏమీ చెప్పలేదని అడగగా అసలు అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదని సమాధానమిచ్చింది షకీలా.
దీంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకర్ ఖంగు తింది.అంతేగాక మహేష్ బాబు, తాను గతంలో ఓ చిత్రంలో నటించామని మహేష్ బాబు తనకు తమ్ముడు లాంటివాడు అని చెప్పుకొచ్చింది షకీలా.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం షకీలా అల్లు అర్జున్ ఎవరో తెలియదన్న విషయాన్ని నెట్టింట్లో అల్లు అర్జున్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక టాలీవుడ్లో మంచి ఫెమ్ ఉన్నటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలియకపోవడం ఏంటని షకీలాని ప్రశ్నిస్తున్నారు.మరికొందరైతే తనకు మరియు అల్లు అర్జున్ కి మధ్య ఏవైనా వ్యక్తిగత కారణాలు ఉన్నప్పటికీ ఇలా అందరి ముందు తెలియదని చెప్పడం సమంజసం కాదని అంటున్నారు.అయితే షకీల గతంలో సంపూర్ణేష్ బాబు నటించిన టువంటి కొబ్బరి మట్ట చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించారు.