జర్నలిస్ట్ అంటేనే ఒక దైర్యం.అలాంటిది ఇంకా రిపోర్టార్లు చేసే పనులు చూస్తే ఎవరైనా సరే ముక్కన వేలు వేసుకోవాల్సిందే.
అయితే ఈ నేపథ్యంలోనే ఓ మహిళా రిపోర్టర్ చేసిన దైర్యం చూస్తే ప్రస్తుతం అందరూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.అసలు ఆ మహిళా జర్నలిస్ట్ ఎం చేసింది అంటే.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా రిపోర్టర్ పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తోంది ఓ మహిళా జర్నలిస్టు.అయితే అందులో భాగంగా ఆమె ఓ పామును మేడలో వేసుకొని రిపోర్టింగ్ చేస్తుంది.
అయితే ఆ పాము ఉన్నట్టుంది బుసలు కొట్టడం ప్రారంభించింది దీంతో ఆమె గజగజ వణిపోయింది.
అయితే అది అంత రికార్డు అవ్వడంతో ఆమె బయాడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్కై న్యూస్ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో జరిగింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఏది ఏమైనా ఆమె ధైర్యాన్ని చూసి ప్రస్తుతం నెటిజన్లు అంత వామ్మో అంటున్నారు.