ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తిమ్పూ సొంతం చేసుకున్న నటి విజయశాంతి.తెలుగులో అగ్ర హీరోలందరితో కలిసి నటించిన విజయశాంతి, చిరంజీవితో కలిసి చేసిన సినిమాలలో అతనికి పోటీగా డాన్స్ చేసి సత్తా చాటేది.
దీంతో అటు కమర్షియల్ సినిమాలతో పాటు, ఇటు మంచి కథ బలం సినిమాలతో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.తరువాత తెలుగులో యాక్షన్ క్వీన్ గా మారిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ కథలతో వరుస సక్సెస్ లు అందుకుంది.
ఆ హీరోగా చేసిన సినిమాలలో కర్తవ్యం ఇప్పటికి అందరికి భాగా నచ్చుతుంది.అలాగే ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు కూడా విజయశాంతి సత్తాని పరిచయం చేస్తాయి.
ఇదిలా ఉంటే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న విజయశాంతి త్వరలో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది.హిట్ చిత్రాల దర్శకుడు త్వరలో మహేష్ తో తెరకెక్కించే సినిమా లో కీలక పాత్ర కోసం విజయశాంతిని రంగంలోకి దించుతున్నాడు.
అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ చూసి, అలాగే పాత్ర ప్రాధాన్యత తెలుసుకొని ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.ఇక ఇందులో మరో కీలక పాత్ర కోసం నిర్మాతగా మారిన నటుడు బండ్ల గణేష్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.