లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీని టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్న రాహుల్ గాంధీ, కొన్ని సందర్భాలలో శ్రుతిమించి చేస్తున్న విమర్శలు మళ్ళీ అతని మెడకి చుట్టుకుంటున్నాయి.ఆ మధ్య మోడీని చౌకీదార్ గా రాహుల్ గాంధీ విమర్శ చేసాడు.
ఇప్పుడు బీజేపీ పార్టీ నేతలు అందరూ అనే మాటని తమ ఎన్నికల అస్త్రంగా వాడుకొని దేశానికి కాపలా కాసే తామంతా చౌకీదార్లమే అంటూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పేరు ముందు చౌకీదార్ అనే పేరు జోడించుకొని కావాల్సినంత మైలేజ్ సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో దొంగలు అందరి ఇంటి పేరు మోడీనే కామన్ గా ఉంటుంది అంటూ విమర్శలు చేశారు.
దీనిని ఇప్పుడు మోడీ ఇంటి పేరు కలిగి ఉన్న బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ సీరియస్ గా తీసుకొని రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేయడం విశేషం.అలాగే రాహుల్ వాఖ్యలపై యూపీకి చెందిన జేకీ మోడీ అనే వ్యక్తి కూడా కోర్ట్ లో కేసు వేసారు.
దీంతో ఇప్పుడు రాహుల్ విమర్శలు మరోసారి వివాదాస్పదంగా మారాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.