మోడీ పరిపాలన భారత్ లో పత్రికా స్వేచ్చ హరించిపోయింది అంటున్న ఆ నివేదిక

ప్రతీకా స్వేచ్చ ఎక్కువగా ఉండే దేశాల జాబితాలో ఒకప్పుడు ఇండియా టాప్ లో ఉండేది.జర్నలిస్ట్ పేపర్ లో ఒక వార్త రాస్తే అధికారుల నుంచి నాయకుల వరకు అందరూ భయపడే వారు.

 Dont Have Freedom Of Speech To Media In India-TeluguStop.com

అలాగే వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.అదే సమయంలో జర్నలిస్ట్ లపై సమాజంలో గౌరవం కూడా ఎక్కువగా ఉండేది.

మన పత్రికా జర్నలిస్ట్ అంటే సినిమాలలో చూపించినట్లు భుజానికి ఒక బ్యాగ్, జేబులో పెన్ను పెట్టుకొని, సైకిల్ మీద ఎక్కడికైనా వెళ్లి ధైర్యంగా వార్తలు సేకరించే వ్యక్తి కనిపిస్తాడు.అయితే అలాంటి జర్నలిస్ట్ ఇప్పుడు ధైర్యంగా వార్తలు రాయలేని పరిస్థితి వచ్చేసింది.

ప్రపంచ దేశాలలో పత్రికా స్వేచ్ఛలో భారత్ ఎంతగా దిగజారిపోతోంది అనే విషయాన్ని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ 180 దేశాలలో పత్రికా స్వేచ్ఛ మీద ఉన్న పరిస్థితులను విశ్లేషించి ర్యాంక్ లను ప్రదర్శిస్తుంది.ఇందులో భారత్ 140 స్థానంలో ఉంది.

గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది రెండు స్థానాలు దిగజారింది.జర్నలిస్టులపై ద్వేషం, హింస రూపు దాలుస్తోందని, భయోత్పాతాన్ని పెంచుతోందని ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ పట్టిక పేర్కొంది.

హిందూత్వని సమర్థించే ప్రధాని మోడీ మద్దతు దారులు వారికి వ్యతిరేకంగా వినిపించే నోళ్లు మూయించేందుకు ప్రణాళిక బద్దంగా విషం చిమ్ముతూ స్వేచ్ఛను హరిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube