తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సిఎం ఎవరనేది అత్యంత ఆసక్తి రేపిన అంశం ఎందుకంటే ఆ పార్టీనుంచి దాదాపు అరడజన్ మంది నేతలు సిఎం రేస్ లో ఉంటూ వచ్చారు.రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్( Madhu Yaskhi Goud ), సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఇలా కొంతమంది పేర్లు గట్టిగా వినిపించాయి.ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు భట్టి విక్రమార్క ఏకంగా పార్టీ హైకమాండ్ తో కూడా సిఎం పదవిపై మంతనాలు జరిపారు.
అయితే రేస్ లో ఎంతమంది ఉన్నప్పటికి అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే సిఎంగా ప్రకటించింది.

దీంతో సిఎం పదవిపై రచ్చ తగ్గినట్లే అనుకున్నారంతా.కానీ సిఎం పదవి రేవంత్ రెడ్డికి కట్టబెట్టడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) మరియు భట్టి విక్రమార్క అలకబూనినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఇతర కాంగ్రెస్ నేతలంతా రేవంత్ రెడ్డికి విసెస్ తెలిపినప్పటికి వీరిద్దరు మాత్రం సైలెంట్ గానే ఉన్నారనే టాక్ పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
అయితే భట్టి విక్రమార్క కు డిప్యూటీ సిఎం పదవి, ఉత్తమ్ కు మరో కీలక పదవి అప్పటించేందుకు అధిష్టానం సిద్దమైనప్పటికి వారు సిఎం పదవే గురిగా ఉన్నట్లు వినికిడి.దీంతో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి చిక్కులు తప్పవా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రస్తుతం వీరిద్దరు డీకే శివకుమార్ తో సమావేశం అయి సిఎం పదవి విషయంలో పునఃఆలోచించాలని డిమాండ్ చేస్తున్నట్లు టాక్.రేపు సిఎంగా రేవంత్ రెడ్డి ( Revanth reddy )ప్రమాణస్వీకారం చేయబోతున్నవేళ భట్టి, ఉత్తమ్ ఇద్దరు కూడా డీకేతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.మరి వీరిద్దరిని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.అయితే వీరిద్దరిలో అసహనం అలాగే కొనసాగితే కాంగ్రెస్ రెండుగా చీలే అవకాశం లేకపోలేదు.మరి కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంతర్గత కుమ్ములాటలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.