కొబ్బరి ఎంత ఆరోగ్యకరమైనదో మనకి తెలిసిన విషయమే.కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
కాని మామూలు కొబ్బరి కాదు, ఎండిన కొబ్బరి వలన దొరికే లాభాలు ఏంటో తెలుసా ? అసలు ఎండిన కొబ్బరి ఏంటి ? కొబ్బరినీటి తడి, లేదా మాయిశ్చర్ లేని కొబ్బరి.మరి కొబ్బరి నీళ్ళలో ఉండే అద్భుతాలని పొందలేనప్పుడు మామూలు కొబ్బరి ఎంతవరకు పనిచేస్తుంది ? మనకు ఎలా పనికివస్తుంది ?
ఎండిన కొబ్బరి ఊరికే ఖాలిగా ఉండదు కదా.అది ఎండినా, దాంట్లో కాపర్, ఫైబర్, సేలేనియం ఉంటాయి.పైగా ఇందులో ట్రాన్స్ ఫాట్స్ ఉండవు.
కాబట్టి కొబ్బరి ఎండినంత మాత్రానా దానివలన అది న్యూట్రిషన్ వాల్యూ కోల్పోతుందేమో అని అనుకోవద్దు.దాని వలన ఎన్నో లాభాలు ఉంటాయి.
* ఎండిన కొబ్బరిలో సేలేనియం ఉంటుందని ఇప్పటికే చెప్పాం కదా.ఈ సేలేనియం సేలేనోప్రోటీన్స్ శరీరంలో విడుదల చేస్తుంది.ఇది ఎన్నో రోగాలను నయం చేస్తుంది.కాబట్టి ఎండిన కొబ్బరి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందని చెప్పుకోవచ్చు.ఇది ఇమ్యునిటి సిస్టమ్ కి బాగా ఉపయోగపడే ఆహారమని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
* రక్తహీనత సమస్య చాలామందికి ఉంటుంది.
అందులోనూ ఇది స్త్రీలలో ఎక్కువ.ఎందుకంటే వారి శరీర నిర్మాణం అలాంటిది.
పీరియడ్స్ లో చాలా రక్తాన్ని కోల్పోతారు.అందుకే స్త్రీలకి రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.
ఎండిన కొబ్బరిలో మంచి ఐరన్ గణాలు ఉండటంతో ఇది రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.
* మతిమరుపు కూడా ఓ కామన్ సమస్య అయిపొయింది ఈ కాలంలో.
నిన్న ఓ వస్తువు ఎక్కడో పెడితే, ఈరోజు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాదు.ఎండిన కొబ్బరి రెగ్యులర్ గా తినాలే కాని ఇది మెదడు పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
దీంట్లో ఉన్న న్యూట్రిషన్ బ్యాలెన్స్ అలాంటిది.
* సేలేనియం ఇటు రోగనిరోధకశక్తిని పెంచుతూ రోగాలతో పోరాడుతూనే, పురుషుల ఫర్టిలిటి అంటే, పిల్లల్ని కనే సామార్ధ్యాన్ని వీర్యంలో పెంచుతుంది.
ఇది నిజంగానే నిజం.ఎండిన కొబ్బరి వీర్యకణాల కౌంట్ ని పెంచుతుంది.
* ఇది అతి పెద్ద లాభం.కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది.
పురుషుడికి రోజుకి 38గ్రాముల డైటరి ఫైబర్ అవసరం, అలాగే మహిళలకి 25 గ్రాములు అవసరం.ఈ అవసరాన్ని ఎండిన కొబ్బరి తీర్చి గుండె సంబంధిత వ్యాధులను దూరం పెడుతుంది.
* జీర్ణ సమస్యలు, కీళ్ళ నొప్పుల సమస్యలను కూడా అడ్డుకుంటుంది ఎండిన కొబ్బరి.ఇది ప్రోస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ సెల్స్ పెరక్కుండా అడ్డుకుంటుంది కూడా.