నా ఫ్లాట్‌ను ఆక్రమించుకున్నారు .. 82 ఏళ్ల వయసులో ఎన్ఆర్ఐ మహిళ న్యాయ పోరాటం

వివిధ దేశాల్లో స్థిరపడిన పంజాబీ ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రవాసుల ఆస్తులను కొందరు అక్రమించుకోవడం, నకిలీ పత్రాలను సృష్టించి తమ సొంతం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

 82-year-old Nri Woman Alleges No Action On Plot Grab Plaint Chandigarh Court Ord-TeluguStop.com

న్యాయ వ్యవస్థలోని లోసుగులను అడ్డుపెట్టుకుని వీరు విచారణ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నారని పలువురు ఎన్ఆర్ఐలు వాపోతున్నారు.తాజాగా రూ.కోట్ల విలువైన తన ఫ్లాట్‌ను లాక్కున్నారంటూ 82 ఏళ్ల ఎన్ఆర్ఐ మహిళ కోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది.బాధితురాలిని చందర్ శర్మగా( Chander Sharma ) గుర్తించారు.

ఆమె ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక కోర్టు చండీగఢ్( Chandigarh ) పోలీసులను ఆదేశించింది.

ఈ భూ వివాదానికి సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది మన్‌దీప్ సింగ్ సైనీ ( Mandeep Singh Saini ) ద్వారా ఫిర్యాదు చేశారు చందర్ శర్మ.

సెక్టార్ 36 బీలోని ఒక ఫ్లాట్‌కు తానే యజమానిని అని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, తన కుమారుడితో కలిసి విదేశాల్లో ఉంటున్నానని, చాలాకాలంగా భారత్‌కు వెళ్లలేదని చందర్ పిటిషన్‌లో తెలిపారు.

Telugu Chander Sharma, Chandigarh, Counselmandeep, Nri Assets, Nri-Telugu NRI

ఎన్ఆర్ఐ హోదా, వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఫ్లాట్‌ను తరచుగా తనిఖీ చేయలేకపోయానని చెప్పింది.ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఫ్లాట్‌లోకి చొరబడి తాళం పగులగొట్టి ఆక్రమించుకున్నట్లుగా ఇరుగుపొరుగు తనకు సమాచారం అందించారని చందర్ శర్మ ప్రస్తావించారు.దీనిపై తాను తక్షణం ఎస్ఎస్‌పీకి ఫిర్యాదు చేశానని.కానీ 15 నెలలు గడుస్తున్నా ఎఫ్ఐఆర్( FIR ) నమోదు చేయలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొంది.నిందితులు తప్పుడు, నకిలీ పత్రాల ద్వారా ఫ్లాట్ తమదని రుజువు చేసుకున్నారని చందర్ ఆరోపించారు.నికిలీ డాక్యుమెంట్ల( Fake Documents ) ఆధారంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని.

నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) పొందుతున్నారని ఆమె వెల్లడించారు.

Telugu Chander Sharma, Chandigarh, Counselmandeep, Nri Assets, Nri-Telugu NRI

ఇరుపక్షాల వాదనలు విన్న జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ పర్మోద్ కుమార్ .ఫిర్యాదుదారులే ఇంటి యజమాని అని, ఆమె ఏ వ్యక్తిపై జీపీఏ బదిలీ చేయలేదన్నారు.ఇంటిని ఆక్రమించి మోసం, దొంగతనం, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడినట్లుగా నిర్ధారించారు.

తక్షణం ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేయాలని సెక్టార్ 36 పోలీస్ స్టేషన్ ఎస్‌వోహెచ్‌ను మేజిస్ట్రేట్ ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube