నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి.( Kalki ) ఈ సినిమాను అశ్వినీ దత్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేసాయి.
దానికి తోడు ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ నడిపిన బుజ్జి అనే కారుని పరిచయం చేయడంతో ఆ అంచనాలు కాస్త మరింత పెరిగాయి.దీంతో ఈ సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.
విడుదల తేదికి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

రెండు రాష్ట్రాల్లోనే కాదు కల్కి కోసం నార్త్ సైడ్ కూడా భారీ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ముంబైలో ఒక భారీ స్థాయి ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇక తెలుగులో కూడా కల్కి కోసం ఒక పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ లో ఉందట.
అది కూడా ఏపీలో జరుగుతుందని తెలుస్తుంది.ఈ ఈవెంట్ కి ఏపీ కొత్త సీఎం చంద్రబాబు, ( Chandrababu ) జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇద్దరిని ఆహ్వానించేలా మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.
ఏపీ ఎలక్షన్స్ లో కూటమిగా ఏర్పడి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించిన విక్టరీ తెలిసిందే.

కల్కి నిర్మాత అశ్వనీదత్ కూడా వారికి మోరల్ సపోర్ట్ గా ఉన్నారు.మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ఏపీలో గత ఐదేళ్లు సినిమా పరిశ్రమకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది.అయితే మారిన ప్రభుత్వం అలా కాకుండా సినీ పరిశ్రమకు అండదండగా ఉంటుందని భావిస్తున్నారు.
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ విషయాన్ని డిక్లేర్ చేసేలా కొత్త సీఎం చంద్రబాబుతో పాటు సినీ హీరో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ని ఈ వేదికకు ఆహ్వానిస్తారని తెలుస్తోంది.మరి కల్కి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారా లేదా కల్కి కోసం మరో గెస్ట్ ని ఎవరినైనా తీసుకొస్తారా అన్నది చూడాలి.