పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితం అయ్యింది.నిన్న విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్ ఏకంగా రెండున్నర మిలియన్స్ ట్వీట్స్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్ సినిమాకు చెందిన హ్యాష్ ట్యాగ్ కూడా ఈ స్థాయిలో పోస్ట్‌లను సొంతం చేసుకోలేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ జరుగుతోంది.
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో సినిమా ఏకంగా వంద కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
దిల్‌రాజు ఈ చిత్రాన్ని దాదాపుగా 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.సినిమా చాలా సింపుల్‌గా ఉన్నా కూడా అంత బడ్జెట్ ఎందుకా అని చాలా మంది అనుకున్నారు.పవన్‌కు 50 కోట్లకు పైగా పారితోషికం ముట్టజెప్పుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అంత భారీ పారితోషికం పవన్‌కు అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేశారు.తాజాగా వచ్చిన ఫస్ట్‌లుక్ రెస్పాన్స్ చూసి యాబై కాదు వంద కోట్లు అయినా కూడా పవన్‌కు తక్కువే అంటున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా కూడా ఆయన క్రేజ్ స్టార్‌డం ఏమాత్రం తగ్గలేదు.అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం.అందుకే ఆయన వరుసగా సినిమాలు చేస్తూ డబ్బులు వెనుక వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.నాలుగు సినిమాలు చేసినా 200 కోట్ల రూపాయల పారితోషికం.వకీల్ సాబ్ సక్సెస్ అయితే పవన్‌కు వంద కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.