అగ్ర రాజ్యం అమెరికాకు మాయని మచ్చగా నిలుస్తోంది గన్ కల్చర్.ఒకటి కాదు రెండు కాదు నెల రోజుల వ్యవధిలో వార్తల్లోకి వచ్చిన తుపాకి పేలుళ్ళ ఘటనలు మూడు కాగా సభ్య సమాజానికి తెలియకుండా జరిగే ఘటనలు యన్నో ఉంటాయి.
తాజాగా అమెరికాలోని డెట్రాయిట్ లో ఉన్న సబర్బన్ ఆక్సఫర్డ్ స్కూల్ లో జరిగిన కాల్పులలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా 10 వరకూ గాయపడినట్టుగా తెలుస్తోంది.ఇదే స్కూల్ లో చదువుకుంటున్న 15 ఏళ్ళ విద్యార్ధి ఈ గోరానికి పాల్పడినట్టుగా అధికారులు వెల్లడించారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.
మధ్యాహ్నన సమయంలో స్కూల్ నుంచీ కాల్పులు జరుగుతున్నట్టుగా ఫోన్ వచ్చిందని, మైకేల్ మెక్ కేబ్ అనే విద్యార్ధి ఈ దారుణానికి పాల్పడినట్టుగా స్కూల్ యాజమాన్యం తెలిపిందని, అతడు ఉన్నట్టుండి విచక్షణా రహితంగా కాల్పులు జరపగా ఇద్దరు అమ్మాయిలతో పాటు, ఓ విద్యార్ధి మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయుడితో సహా 9 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు విచారణలో తేల్చారు.అయితే ఈ ఘటన వివరాలుతెలిసిన వెంటనే హుటాహుటిగా ఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు.
నిందితుడిని గుర్తించి అతడిపై 15 రౌండ్ల కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై మిచిగాన్ గవర్నర్ విచారం వ్యక్తం చేయగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సాకీ విచారం వ్యక్తం చేశారు.
కాగా మృతి చెందిన కుటుంభ సభ్యులకు అధ్యక్షుడు బిడెన్ సంతాపం తెలిపారు.ఈ ఘటనపై అమెరికాలోని ప్రజా సంఘాలు, నిపుణులు మండిపడుతున్నారు.
కేవలం ఒక్క నెల కాలంలో అమెరికాలో ఇలాంటి ఘటన జరిగడం ఇదే మూడవ సారని, గన్ కల్చర్ ను నిరోధించేలా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితిలు మరింత దారుణంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు.బిడెన్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని, బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.