కొత్త సీఈవోకు ట్విట్టర్ ఇచ్చే జీతం ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే!

సోషల్ మీడియాల్లో ఒకటైన ట్విట్టర్ కొత్త సీఈవో ను ప్రకటించిన విషయం తెలిసిందే.ట్విట్టర్ సీఈవో ప్రకటన వచ్చినప్పటి నుండి ఆయన గురించే ఎక్కడ చూసిన చర్చ జరుగుతుంది.

 Newly Crowned Twitter Ceo Parag Agrawal To Draw 1 Million Dollars Annual Salary-TeluguStop.com

ఎందుకంటే ట్విట్టర్ కొత్త సీఈవో భారత్ కు చెందిన వ్యక్తి కావడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ట్విట్టర్ కొత్త సీఈవో మన భారతీయ వ్యక్తి అయినా పరాగ్ అగర్వాల్.

ఈ సందర్భంగా అందరు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

నూతన సీఈవో ట్విట్టర్ లో 10 సంవత్సరాల క్రితం మామూలు ఇంజినీర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు అదే కంపెనీకి సీఈవో అవ్వడం విశేషం.

అందుకే ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఈవో గా పరాగ్ ను నియమించారు.

భారతీయ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పడంతో ఆయనపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈయన జీవితానికి సంబంధించిన విషయాలను ట్విట్టర్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమీషన్ కు తెలిపింది.

Telugu @paraga, @paragagarwal, Platm, Mumbaiparak, Newlyceo, Paragagarwal, Ceo-L

ఇక తాజాగా ఈయన వేతనం గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆయన వేతనం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అంత అందుకుంటున్నాడు.ఈయనకు ట్విట్టర్ ఏడాదికి 1 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ లో రూ.7,51,13,500 జీతం పొందుతున్నాడని వెల్లడించింది.

Telugu @paraga, @paragagarwal, Platm, Mumbaiparak, Newlyceo, Paragagarwal, Ceo-L

అంతేకాదు ఆయనకు 1.25 మిలియన్ డాలర్లు అంటే రూ.94 కోట్లు విలువైన షేర్లు కూడా పొందుతున్నారని తెలిపింది.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 01 తేదీ నుండి పరాగ్ అగర్వాల్ కు ఇవి అందుతాయని తెలిపింది.ఈయన నవంబర్ 29 నుండి సీఈఓ గా పదవిని స్వీకరించారు.

ఇక పరాగ్ అగర్వాల్ దిగ్గజ సంస్థ అయినా ట్విట్టర్ కు అతి చిన్న వయసులోనే సీఈవో గా నియమితులైన వ్యక్తిగా రికార్డ్ కెక్కాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube