ప్రకాశవంతమైన ముఖానికి హోంమేడ్ హెర్బల్ పాక్స్     2018-05-20   23:46:03  IST  Lakshmi P

సాధారణంగా చాలా మంది ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి కాస్మొటిక్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే వాటి కారణంగా ముఖం మీద ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాటిలో వాడే కొన్ని కెమికల్స్ కారణంగా ఎలర్జీలు వస్తాయి. అందువల్ల ఎటువంటి ఎలర్జీలు, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే హెర్బల్ పాక్స్ ఉపయోగించాలి. ఈ హెర్బల్ పాక్స్ ని ఇంటిలోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

తేనే

తేనెలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ముఖానికి తేనే రాసుకొని పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద

కలబంద దాదాపుగా అన్ని రకాల చర్మ సమస్యలకు పరిష్కరాన్ని చూపుతుంది. ముఖ్యంగా డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కలబంద జెల్ ని ముఖానికి రాసి 5 నిముషాలు మసాజ్ చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక నెల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.