జపాన్( Japan ) ప్రజలు ఎప్పుడూ కూడా మిగతా ప్రపంచం కంటే ఒక పది అడుగులు ముందుగానే ఉంటారు.టెక్నాలజీ, మెడికల్ ఫీల్డ్, మౌలిక సదుపాయాలు రవాణా వంటి అన్ని రంగాలలో వారు సూపర్ అడ్వాన్స్డ్ గా ఉంటారు.
ఆహారాలు తయారు చేసే విషయంలో కూడా క్రియేటివిటీ చూపిస్తారు.తాజాగా జపనీయుల ఎంత వినూత్నంగా సర్వ్ చేస్తారో ప్రజలకు తెలిసి వచ్చింది.

జపాన్ దేశం, క్యోటో( Kyoto)లోని “కేఫ్ 33” అనే ఒక కేఫ్ ఐస్ కాఫీని అందించడానికి ఒక కొత్త పద్ధతిని ప్రారంభించింది, ఇది చాలా మందిని ఆకట్టుకుంటోంది.వేసవి రావడంతో, చల్లని పానీయాలకు డిమాండ్ పెరిగింది, ఈ కేఫ్ ఐస్ కాఫీ ప్రదర్శన చాలా ప్రత్యేకంగా ఉండి, ప్రజలను ఫిదా చేస్తోంది.ఈ కేఫ్ సిబ్బంది ఒక పెద్ద ఐస్ ముక్కలో ఒక గ్లాసు లాంటి రంధ్రాన్ని తవ్వి ఐస్ కాఫీని అందిస్తారు.ఇది సాధారణ ఐస్ పీస్ కాదు.
ఈ డ్రింక్ కోసం ఒక ఐస్ మాస్టర్ దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు.

ఆర్డర్ చేసిన తర్వాత వెయిటర్ ఒక కప్పు బ్లాక్ కాఫీ( Black coffee ), వనిల్లా ఐస్ క్రీమ్, పాలు, సిరప్, ఒక ప్రత్యేక ఐస్ ముక్కని టేబుల్‌కు తీసుకువస్తాడు.ఆ తర్వాత, కాఫీ, ఇతర పదార్థాలను ఐస్‌క్యూబ్‌లో పోసి కలుపుతారు.ఇది ఒక అందమైన రీతిలో డ్రింక్ తయారు చేయడానికి, అందించడానికి సహాయపడుతుంది.
ఈ ప్రత్యేక ఐస్ కాఫీ రోజుకు కేవలం ఐదుగురు కస్టమర్లకు మాత్రమే, అది కూడా మధ్యాహ్నం కొన్ని గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.దీని ధర 2,000 యెన్, ఇది సుమారు 1,072 భారత రూపాయలకు సమానం.
కొందరు ఈ ఆలోచనకు ఆకర్షితులయ్యారు, మరికొందరు ఐస్ కాఫీ( Ice coffee ) తాగిన తర్వాత పెద్ద ఐస్ ముక్కతో ఏం చేస్తారో చెప్పాలని అడిగారు.







