ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది.నువ్వా నేనా సై అంటే సై అన్నట్టుగా ఎన్నికలు జరుగుతున్నాయి.
మొన్నటితో ప్రచారాలు ముగియగా నేడు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ బూత్ వద్దకు వెళ్తున్నారు.ఇప్పటికే సామాన్యులు సెలబ్రిటీలు చాలామంది ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్టీఆర్ అల్లు అర్జున్ లాంటి కొందరు సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజాగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఓటు వేయాడానికి వచ్చిన ఎన్టీఆర్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇవాళ హైదరాబాద్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో భార్య ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఓటు వేయడానికి వెళ్లిన ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకోవడంతో తమ పార్టీకి అనుకూలంగానే ఎన్టీఆర్ బ్లూ షర్ట్‌తో వచ్చారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.కాగా ఈ ఎన్నికల్లో తమ కుటుంబ పార్టీ అయిన టీడీపీకి కానీ తన స్నేహితులు అయిన కొడాలి నాని, వంశీలకు కూడా ఎన్టీఆర్ ఎటువంటి సపోర్టు చేయలేదు.ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకు దూరంగా ఉన్నా ఎన్నికల రోజు మాత్రం రాజకీయాల్లోకి వచ్చారు.

ఇప్పటికే కొంత మంది సినిమా వారు పవన్ కళ్యాణ్‌కు వ్యక్తిగతంగా వీడియోలు, ప్రచారాలు చేసిన విషయం తెలిసిందే.అయితే తారక్ పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయడానికి బ్లూ షర్ట్ తో రావడంతో వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







