రేపు ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో అర్థం కాక అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.
ఈ ఒక్కరోజులో ప్రజల మూడ్ మార్చేందుకు, తమ పార్టీ కే జనాలు ఓట్లు వేసే విధంగా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.టిడిపి, జనసేన, కూటమి ఒకవైపు, వైసీపీ మరోవైపు ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఓటరు నాడి ఏ విధంగా ఉందనేది సరైన క్లారిటీ రావడం లేదు.ఇది ఎలా ఉంటే తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రజలను ఉద్దేశించి లేఖను విడుదల చేశారు.
ఈ లేఖలు టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందో చెబుతూనే, వైసిపి పైన( YCP ) చంద్రబాబు విమర్శలు చేస్తూ లేఖను విడుదల చేశారు.మీ శ్రేయోభిలాషి అంటూ చంద్రబాబు జనాలకు లేఖ రాశారు.

ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మీడియాకు చంద్రబాబు లేఖను( Chandrababu Letter ) విడుదల చేశారు.ఈ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.ప్రజలు గెలవాలి.రాష్ట్రం నిలవాలి అంటూ లేఖలో నినాదించారు.ఈ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవని చంద్రబాబు పేర్కొన్నారు.మీ భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు.2014లో రాష్ట్రం విడిపోయిందని, అనేక కష్టనష్టాలతో నాడు టిడిపి( TDP ) ప్రభుత్వం ప్రస్థానం మొదలుపెట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు.సుపరిపాలనతో రాష్ట్రాన్ని కొద్దికాలంలోనే అభివృద్ధి దిశగా నడిపించామని,

2019 లోనూ టిడిపి గెలిచి ఉంటే ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉండేదని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు కానీ మోసపూరిత హామీలతో జగన్( Jagan ) అధికారంలోకి వచ్చి, అధికారం చేపట్టినప్పటి నుంచే విధ్వంసక, అరాచక పాలనకు తెరతీశారని, విమర్శించారు.వ్యవస్థలను చెరబట్టి, ప్రశ్నించే ప్రజలను, విపక్షాలను అణిచివేశారని, ఇప్పుడు వైసీపీ భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునే అవకాశం వచ్చిందని, మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని, అరాచకాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అజెండాలతో ముందుకు వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.