ప్రస్తుత వేసవి కాలంలో చాలామంది చర్మం పై పెట్టే శ్రద్ధ జుట్టు విషయంలో పెట్టరు.ఫలితంగా వేడి, తేమ మరియు సూర్యరశ్మి కలయిక మన జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
హెయిర్ ఫాల్ ను పెంచుతుంది.అందుకే చర్మం విషయంలోనే కాకుండా జుట్టు విషయంలోనూ శ్రద్ధ వహించాలి.
ఈ నేపథ్యంలోనే మండుతున్న వేసవిలో జుట్టు రాలడాన్ని( Hair loss ) నివారించే టాప్ అండ్ బెస్ట్ టోనర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం( rice ), పది లవంగాలు( cloves ), మూడు బిర్యానీ ఆకులు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ చల్లారే లోపు ఒక ఉల్లిపాయ తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఈ ఉల్లిపాయ తురుమును( Grate onion ) క్లాత్ లో వేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉల్లిపాయ జ్యూస్ ను ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ లో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టోనర్ అనేది సిద్ధమవుతుంది.
ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ప్రస్తుత వేసవికాలంలో వారానికి ఒకసారి ఈ హోమ్ మేడ్ హెయిర్ టోనర్ ను కనుక వాడితే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.హెయిర్ ఫాల్ ను అరికట్టడంలో ఈ టోనర్ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.
అలాగే ఈ టోనర్ జుట్టు ను ఆరోగ్యంగా మారుస్తుంది.హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది మరియు చుండ్రు సమస్యను సైతం దూరం చేస్తుంది.